Tuesday, March 26, 2024

Tokyo Olympics: చరిత్ర సృష్టించిన గోల్ ఇదే..మీరూ చూడండి

టోక్యో ఒలింపిక్స్ లొ భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ కి వెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 22వ నిమిషంలో ఇండియన్ ప్లేయర్ గుర్జిత్ కౌర్ కొట్టిన గోలే మ్యాచ్ మొత్తంలో నమోదైన ఏకైక గోల్. ఈ విజయంతో తొలి సారి సెమీస్ చేరుకొని భారత జట్టు చరిత్ర సృష్టించింది. డ్రాగ్ ఫ్లిక్ స్పెష‌లిస్టు గుర్జిత్ కౌర్ ( Gurjit Kaur )చేసిన గోల్ ఆ మ్యాచ్‌కే హైలైట్‌. పెనాల్టీ కార్న‌ర్‌ను ఆమె గోల్‌గా మలిచిన తీరు ప్ర‌శంస‌నీయం. 22వ నిమిషంలో కొట్టిన ఆ గోల్‌.. ఇండియాను సెమీస్‌లోకి తీసుకువెళ్లింది. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు సెమీస్‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి.దీంతో మూడు సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ ఆస్ట్రేలియాకు భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు షాకిచ్చింది. గుర్జిత్ కొట్టిన గోల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జ‌స్ట్ వాచ్‌.

ఇది కూడా చదవండి: ఉచిత క‌రెంట్ వ‌ద్దు..ఎమ్మెల్యే రాఘ‌వ్ కావాలని ట్వీట్ చేసిన యువతి..

Advertisement

తాజా వార్తలు

Advertisement