Wednesday, April 17, 2024

నేటి బంగారం, వెండి ధరలివే..

బంగారం కొనేవారికి అలర్ట్. గత కొద్దిరోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం రేట్లు ఏం మారలేదు. ఇక హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా రూ.51,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 వద్ద ఉంది. ఇదే దేశ రాజధాని దిల్లీలో చూస్తే 22 క్యారెట్లకు రూ.51,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.56,600 వద్ద ట్రేడవుతోంది. వెండి రేట్ల విషయానికి వస్తే దిల్లీలో కిలో వెండి రేటు రూ. 400 పెరిగి రూ.66,900కు చేరింది. ఇక కొద్దిరోజుల కిందట ఇది రూ.70 వేల మార్కు వద్ద ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ఏ మార్పు లేకుండా రూ.70 వేల కొనసాగుతోంది. ఇక ఇది కూడా ఒక దశలో రూ.76 వేల మార్కుపైన చేరడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement