Thursday, April 25, 2024

నేటి రాశిఫలాలు(18-03-2023)

మేషం: అరుదైన ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కర్కాటకం: విద్యార్థులకు కొత్త ఆశలు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

- Advertisement -

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. గృహయోగం. పోటీ-పరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం: మిత్రులతో సఖ్యత. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. శ్రమ తప్పదు. నిరుద్యోగులకు ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కుంభం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మీనం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement