Saturday, April 20, 2024

నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. అనంత‌రం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. నేడు ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు
మరోవైపు నిన్న(మంగళవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 57,559 మంది భక్తులు శ్రీనివాసున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లుగా ఉంది. అలాగే శ్రీవారికి 18,150 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement