Saturday, April 20, 2024

డిసెంబ‌ర్ 9న రిలీజ్ కానున్న – పంచ‌తంత్రం

రాజ‌శేఖ‌ర్ కుమారై..హీరోయిన్ శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం పంచ‌తంత్రం.. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సినిమాలో కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా నటించడం విశేషం. . టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘పంచతంత్రం’ మూవీని డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. కలర్స్’ స్వాతి కీలక పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి మంచి సంగీత అందించినట్టు తెలిపారు. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement