Thursday, November 14, 2024

Tirumala దేవదేవుడి మురళీకృష్ణుడి అవతారం – చిన్నశేష వాహనంపై విహారం

బ్ర‌హ్మ‌త్స‌వాల రెండో రోజు దేవ‌దేవుడి స‌రికొత్త అవ‌తారం
మాడ వీధుల‌లో సంచ‌రించిన తిరుమ‌లేశుడు

తిరుమల, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

రాత్రికి హంస వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప స్వామివిహారం

ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement