Saturday, April 20, 2024

శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు – భారీగా త‌ర‌లివ‌స్తోన్న భ‌క్తులు

క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో భ‌క్తులు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. కాగా నిన్న 73,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా వీరిలో 41,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వీరికి 9 గంటల్లో దర్శనం అవుతుంది. కాగా హ‌నుమ‌జ్జయంతిని పుర‌స్కరించుకుని నిన్న ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో నిర్వహించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు అల‌రించాయి. ఉద‌యం ఆకాశ‌గంగ‌లోని శ్రీ అంజ‌నాదేవి, శ్రీఆంజ‌నేయ‌ స్వామి వారికి నిర్వహించిన స్నప‌న‌తిరుమంజ‌నం కార్యక్రమంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై సాయంత్రం 4 గంట‌ల‌కు “వీరో హ‌నుమాన్ క‌పిః” అనే అంశంపై డాక్టర్‌ ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement