Friday, April 19, 2024

సామాన్యుల‌కి బంఫ‌ర్ ఆఫ‌ర్ – బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్

ఓటీటీ బిగ్ బాస్ షో ముగిసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు బిగ్ బాస్ లో ప‌లువురు సెల‌బ్రిటీలు మాత్ర‌మే పాల్గొన్నారు..కానీ
బిగ్ బాస్ షో వారు సామాన్యుల‌కి బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు..గత వారం ముగిసిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ తెలుగు షోలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు హీరో నాగార్జునతో కూడిన ఓ వీడియోని విడుదల చేశారు స్టార్‌మా టీమ్‌. ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు.బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ, అందుకే స్టార్‌ మా ఇస్తోంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం.. వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌.. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండిని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లాలనుకునేవారు starmaa.startv.com ఓపెన్‌ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మ‌రి ఎవ‌రైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోకి అప్లై చేసుకునే ఛాన్స్ ని ఇచ్చారు బిగ్ బాస్ వారు.

https://www.youtube.com/watch?v=77BKt5HpUbc
Advertisement

తాజా వార్తలు

Advertisement