Tuesday, May 30, 2023

ఏపీలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల టికెట్ ధరల పెంపు..

సంక్రాంతి సీజన్ లో పోటీలో దిగుతున్న చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య మువీ, బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సింహారెడ్డి మువీలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొద్ది గంటల్లో అధికారికంగా ఉత్తర్వులను ఏపి ప్రభుత్వం విడుదల చేయనుంది. మెగస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచేందుకు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాకు రూ.20 పెంపునకు ఏపీ సర్కార్‌ అనుమతించింది. 10 రోజుల పాటు ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీరసింహారెడ్డి మువీ జనవరి 12న విడుదల కానుండగా, వాల్తేర్ వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement