Wednesday, April 24, 2024

నాలుగు రోజుల్లో..మూడు రాఫెల్‌ జెట్లు

దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే పలు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ తీసుకువచ్చింది ప్రభుత్వం. ఓ వైపు చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దు వద్ద కనసాగుతోన్న ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంతో కేంద్రం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీంతో మరో మూడు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు రాబోయే నాలుగు రోజుల్లో భారత్‌కు రానున్నాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. ఆ తర్వాత మరో తొమ్మిది యుద్ధ విమానాలు ఏప్రిల్‌ మధ్య నాటికి ఫ్రాన్‌ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇప్పటికే ఫ్రాన్స్‌ చేరుకుంది. ఫైటర్‌ జెట్లు ఈ నెల 30 లేదంటే 31న ఫ్రాన్స్‌ నేరుగా అంబాలా ఏర్‌బేస్‌కు చేరుకుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement