Monday, January 17, 2022

ట్రాక్టర్ లోడ్ కింద మూడు క్వింటాళ్ల గంజాయి

గంజాయి స్మగ్లర్లు సరుకుని తరలించడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. ట్రాక్టర్ ట్రాలీ లోడ్ కింద ఏకంగా 3 క్వింటాళ్ల గంజాయి పెట్టెలను అమర్చారు.సరిగ్గా చూస్తే.. ట్రాలీ కింద ప్రత్యేకంగా అమర్చిన అరలో బాక్స్‌లున్నాయి కదా.. అవన్నీ 3 క్వింటాళ్ల గంజాయి నింపిన పెట్టెలు. ఒక్కో దానిలో 2 కిలోలు ప్యాక్‌చేసి ఇలా 150 బాక్స్‌లను తరలిస్తుండగా . కిలో రూ.3 వేలకు కొని మహారాష్ట్రలో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ అమ్మపాలెం క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నారు. మరిపెడ మండలం తండాధర్మారానికి చెందిన బానోత్‌ కిరణ్‌కుమార్, కొత్తగూడెం జిల్లా కోయగూడెంకు చెందిన ఆర్‌ఎంపీ బాదావత్‌ సూర్య ఏపీలోని చింతూరులో గంజాయి కొని తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News