Friday, March 29, 2024

Big Breaking | అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని రెడ్ రివర్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పులకు పాల్పడినవారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్టు రెడ్ రివర్ నగర మేయర్ లిండా కాల్హన్ తెలిపారు.

రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా నిర్వహించిన ఓ మోటార్ సైకిల్ ర్యాలీ సందర్భంగా దుండగులు కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. బైకర్ గ్యాంగ్​ సభ్యులు ఈ కాల్పులు జరిపారని మేయర్ వెల్లడించారు. గాయపడిన వారిని టావోస్ లోని హోలీ క్రాస్ ఆసుపత్రికి, అల్బుక్విర్క్ లోని న్యూ మెక్సికో యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement