Saturday, April 20, 2024

సీఎం కేసీఆర్‎ను దూషించిన ముగ్గురు అరెస్ట్

సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులను బండబూతులు తిట్టే వీడియోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. అసలు అలాంటి వీడియోలు చేయడమే తప్పు అయితే, అలాంటి వీడియోలను వేరే వాళ్లకు ఫార్వర్డ్ చేయడం కూడా తప్పే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో దూషించిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం న్యూ బంజారాహిల్స్ కాలనీకి చెందిన ధరావత్ శ్రీను అనే వ్యక్తి ఈనెల 2న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి జగదీష్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఓ వీడియోలను వాట్సాప్ ద్వారా వేరే వాళ్లకు పంపించాడు. అయితే అది అలా అలా వైరల్ కావడంతో ధర్మాపురం గ్రామ సర్పంచ్ నగేష్ ఈ వీడియో మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే వీడియో చేసిన ధరావత్ శ్రీను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఇలాంటి వీడియోల పట్ల మీరూ జాగ్రత్తగా ఉండండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement