Thursday, March 28, 2024

Indian-Americans | భారత మూలాలున్న ముగ్గురికి.. అమెరికాలో న్యాయమూర్తులుగా అవకాశం

అమెరికాలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తులుగా ముగ్గురు భారతీయ-అమెరికన్ డెమొక్రాట్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఇతర అధికారులతో పాటు ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తులుగా జూలీ ఎ మాథ్యూ, కేపీ  జార్జ్, సురేంద్రన్ కె పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం USలో న్యాయమూర్తి బెంచ్‌కు ఎన్నికైన మొదటి భారతీయ-అమెరికన్ మహిళ అయిన జూలీ ఎ మాథ్యూ, తన రిపబ్లికన్ చాలెంజర్ ఆండ్రూ డోర్న్ బర్గ్ ను ఓడించి రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. మరో నాలుగు సంవత్సరాల పాటు ప్రిసైడింగ్ న్యాయమూర్తిగా కొనసాగుతారు.

ఇక.. జార్జ్, 57 ఏళ్ల డెమొక్రాట్. 2018లో గెలుపొంది హ్యూస్టన్ ప్రాంతంలో, వెలుపల ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కౌంటీలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌లకు తన పరిపాలనలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కాగా, నవంబర్‌లో జరిగిన 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ రేసులో రిపబ్లికన్ ఎడ్వర్డ్ ఎం క్రెనెక్‌ను గెలిపించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి పాటెల్‌ను కూడా కౌంటీ స్వాగతించింది. 52 ఏళ్ల, కేరళకు చెందిన వారు ఆయన. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న అతను 2009 నుండి టెక్సాస్ అటార్నీగా ఉన్నారు. దీనికి ముందు అతను భారతదేశంలో న్యాయవాదిగా పనిచేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement