Sunday, March 26, 2023

కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

క‌రెంట్ షాక్ తో ముగ్గురు రైతులు మృతి చెందిన ఘ‌ట‌న ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన రైతులు పొలం ప‌నుల‌కు వెళ్లారు. పంట పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్ కు గురై అక్క‌డిక్క‌డే మృతి చెందారు. ముందుగా ఒక రైతు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్‌ షాక్ తగిలింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి కూడా షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement