Saturday, January 28, 2023

Accident: రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో జరిగిన ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. మధుకరై-కోయంబత్తూర్ ప్రాంతంలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు సహా రెండు పిల్ల ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.  ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఏనుగులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకుని లోకో పైలట్లను విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement