Saturday, April 20, 2024

Thread Portrait – ధోనీ అంటే ఇంత అభిమానామా బ్రో…(వీడియోతో )

అహ్మాదాబాద్ – ధ‌నాధ‌న్ ధోనీపై అభిమానం ఏ స్థాయిలో ఉందంటే ఓ తెలుగు యువకుడు ఆయనపై ఏకంగా 20 అడుగుల ఎత్తు ఉన్న థ్రెడ్ ఆర్ట్‌ను చిత్రీకరించాడు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఐరన్ ఫ్రేమ్‌ను తయారు చేశాడు. ఆ ఫ్రేమ్‌పై ఫ్లెక్సీలను అతికించి దానిపై ధోని ముఖాన్ని దారాలతో అల్లాడు. దీనికోసం ఆ యువకుడు 24 కిలోమీటర్ల పొడవు ఉన్న దారాన్ని వినియోగించాడు. దీన్ని చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టిందతనికి. ఈ ఐరన్ ఫొటో ఫ్రేమ్‌ను గాల్లోకి ఎత్తడానికి ఏకంగా భారీ క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ధనాధన్ ధోనీపై తన అభిమానాన్ని ఆ తెలుగు యువకుడు ఇలా నిరూపించుకున్నాడు. ఈ ఫ్రేమ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement