Wednesday, April 24, 2024

కోర్సుల ఎంపికలో మారిన విధ్యార్ధుల ఆలోచ‌నలు.. కంప్యూటర్‌ సైన్స్‌కు పెరుగుతున్న‌ డిమాండ్‌..

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఆలోచనా ధోరణి మారుతోంది. ఏదో ఒక స్ట్రీమ్‌లో బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చనే అభిప్రాయం నుంచి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే బ్రాంచులనే ఎంపిక చేసుకోవాలని యువత భావిస్తోంది. దీంతో కంప్యూటర్‌ సైన్స్‌లో మాత్రం తీవ్ర పోటీ నెలకొంటోంది. గతంలో సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)కి ఇదే తరహా డిమాండ్‌ ఉండేది. అయితే రెండు మూడేళ్లుగా కంప్యూర్‌ సైన్స్‌లో ఎక్కువ అవకాశాలు లభిస్తుండటంతో క్రేజీ కోర్సుగా మారింది. ఈ ఏడాది ఈఏపీ సెట్‌(ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తం లక్షా 12 వేల 699 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో వీటిలో 80 వేల 935 సీట్లు భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్ల వివరాలు చూస్తే.. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుకున్న డిమాండ్‌ స్పష్టమవుతుంది. ఈ డిమాండ్‌ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీఎస్‌ఈ సీట్లను పెంచుకునేందుకు యాజమాన్యా లు కోరాయి. కంప్యూటర్‌ సైన్స్‌ స్ట్రీమ్‌లో మొత్తం 24 వేల 904 సీట్లుండగా.. మొదటి విడతలోనే దాదాపు 95 శాతానికిపైగా భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ తర్వాత డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో ఈసీఈ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌(ఈఈఈ), మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement