Saturday, November 27, 2021

ఈ వారం ఎలిమినేష‌న్‌లో ఉన్న వీరే.. బిగ్ బాస్ హౌస్ వీడేదెవ‌రో..

రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజ‌న్ 5 అంద‌రినీ అల‌రిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నిన్న‌టి ఆదివారం అని మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఎలిమినేష‌న్‌కు సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. అదేంటంటే..

ఈ వారం ఎలిమినేష‌న్ ప్రాసెస్‌లో భాగంగా స‌ర్‌ప్రైజింగ్ టాస్క్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే టాస్కులో భాగంగా వ‌రిగ‌డ్డితో చేసిన బొమ్మ‌ల త‌ల‌పై మ‌ట్టి కుండ‌ల‌ను పెట్టి త‌మ‌కు నచ్చ‌ని వారిని ఎలిమినేట్ చేయాల‌ని బిగ్ బాస్ కోరుతాడు. దీంతో కంటెస్టెంట్స్ మ‌ధ్య జ‌రిగే వాగ్వాదం చాలా సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది..

ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేష‌న్ ప్రాసెస్‌లో ఉన్న వారిలో ఏడుగురు ఎలిమినేష‌న్‌లోకి వ‌చ్చారు. వారిలో శ‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, సిరి హ‌న్మంత్‌, ఆర్ జే కాజ‌ల్‌, వీజే స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, ప్రియాంక సింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News