Friday, November 8, 2024

ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న‌చిత్రాలు

ఈ వారం ఓటీటీలో మూడు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి.ఆ జాబితాలో ‘తునీవు’ (తెగింపు) ఒకటిగా కనిపిస్తుంది. అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించగా, హెచ్ వినోత్ దర్శకత్వం వహించాడు. జనవరి 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా నిర్మితమైన ‘రాజయోగం’ .. క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. సాయి రోనక్ – అంకిత సాహ జంటగా నటించిన ఈ సినిమా కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హంట్’ జనవరి 26వ తేదీన థియేట్రికల్ రిలీజ్ ను జరుపుకుంది. శ్రీకాంత్ – భరత్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై విడుదలైంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement