Thursday, April 25, 2024

చరిత్రలో ఇదే తొలి దాడి, అణు విద్యుత్‌ ప్లాంట్‌ సేఫ్‌.. తప్పిన రేడియేషన్‌ ముప్పు

జప్రోజియాలోని అణు విద్యుత్‌ ప్లాంట్‌పై జరిపిన రష్యా దాడిని ఉక్రెయిన్‌.. అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తీవ్రగా ఖండించారు. రష్యా క్షిపణి దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూక్లియర్‌ ప్లాంట్‌పై దాడి జరగడం చరిత్రలోనే ఇది మొదటి సారి అని తెలిపారు. న్యూక్లియర్‌ ప్లాంట్‌ ధ్వంసం అయితే.. యూరప్‌కు ముప్పు పొంచి ఉండేదని తెలిపారు. అదృష్టవశాత్తు అలా ఏమీ జరగలేదని, ఎప్పటికైనా యూరప్‌ దేశాలకు రష్యా రూపంలో ముప్పు పొంచే ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో 15 అణు విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల సాయం పెంచాలని ఆయన కోరారు. పశ్చిమ దేశాలు అందిస్తున్న సాయంపై జెలెన్‌ స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాయని వివరించారు.

ఇప్పటికైనా వెంటనే సాయం పెంచాలని అభ్యర్థించారు. లేనిపక్షంలో రష్యా ఐరోపాలోని మిగిలిన దేశాలను కూడా వదలదని హెచ్చరించారు. రష్యాకు చెక్‌ పెట్టేందుకు నో-ఫ్లై జోన్‌ను అమలు చేయాలని ఈ సందర్భంగా జెలెన్‌ స్కీ కోరారు. రష్యా తప్ప ఏ ఇతర దేశం అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఈ బీభత్సం రష్యాతోనే సాధ్యం అవుతుందని వివరించారు. ఉగ్రవాద ధోరణి అవలంబిస్తోందని, ఇప్పుడు అణు బీభత్సానికి ఒడిగట్టిందని విమర్శించారు. చెర్నోబిల్‌ అణు విపత్తును పునరావృతం చేసేందుకు మాస్కో ప్రయత్నిస్తోందని జెలెన్‌ స్కీ ఆరోపించారు. అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్‌ పేలితే చెర్నోబిల్‌ పేలుడు కంటే పది రెట్లు భారీ నష్టం జరిగే ఉండేదని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement