Saturday, November 26, 2022

పెట్రోలు పోసి నిప్పంటించారు.. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

సూర్యాపేట, (ప్రభ న్యూస్): సూర్యాపేట జిల్లాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. ఆ డెడ్​బాడీని పరిశీలిస్తే పెట్రోలు పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నాయి. అనుమానాస్పద స్థితిలో సగం కాలి ఉన్న మృతదేహం చివ్వెంల మండలం దురాజ్ పల్లి మోడల్ స్కూల్ వెనుక చెట్ల పొదల్లో ఇవ్వాల (శనివారం) రాత్రి లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను పెట్రోల్ తో కాల్చిన ఆనవాళ్లు గుర్తించారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement