Thursday, April 25, 2024

తెలంగాణలో రేపటి నుంచి ఇవి ఓపెన్ !

తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం కుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

కాగా తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన
నేపథ్యంలో రేపటి నుంచి అన్నీ ఓపెన్ చేయనున్నారు.ఆదివారం నుంచి రాష్ట్రంలో పబ్బులు, సినిమాథియేటర్లు, బార్లు, పార్కులు, రెస్టారెంట్లు పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. అన్ని ఆఫీసులు పూర్తి స్థాయిలోకార్యకలాపాలు సాధించనున్నాయి. లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్ల సాయంత్రం 6 గంటల వరకే ఓపెన్ ఉండేవి. అంతర్రాష్ట్ర బస్సులపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement