Friday, April 19, 2024

మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న సూపర్ కార్లు ఇవే..​

ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో జూన్ ఒక ప్రత్యేక నెల కాబోతోంది. ఎందుకంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన కొత్త కార్లు ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాయి. కాగా ఈ అప్‌కమింగ్ మోడల్స్ అద్భుతమైన డిజైన్, అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. మ‌రి ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 5 కార్లు ఏవో చూద్దాం.

- Advertisement -

హోండా ఎలివేట్

హోండా ఎలివేట్ ఒక మిడ్-సైజ్ SUV. హోండా సిటీతో ప్లాట్‌ఫామ్ షేర్ చేసుకునే ఈ SUV జూన్ 6న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది 1.5L పెట్రోల్‌తో సహా 1.5L హైబ్రిడ్‌ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ ఆఫర్ చేస్తుంది. ఈ కారు లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు అందిస్తుంది.

మారుతి సుజుకి జిమ్నీ

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ SUV ధరలు జూన్ 7న రివీల్ కానున్నాయి. ఈ కారు 5-డోర్ వేరియంట్‌ కాగా ఇందులో 1.5L పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ SUV అద్భుతమైన ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ కోసం AllGrip Pro 4X4 సిస్టమ్‌తో వస్తుంది.

వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్

జర్మనీ వాహన దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియా టైగన్ (Taigun), వర్టస్ (Virtus) మోడళ్ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్లను త్వరలోనే విడుదల చేయనుంది. రెండూ 148 bhp, 250 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5L TSI పెట్రోల్ ఇంజన్‌తో వస్తాయి. ఈ కార్లు 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటాయి.

BMW M2

సెకండ్ జనరేషన్ BMW M2 ఈ నెలలో ఇండియాలో విడుదల కానుంది. ఈ స్పోర్టీ కారు 460 bhp పవర్, 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 3.0L ట్విన్-టర్బో ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్‌తో లాంచ్ అవుతుంది. BMW M2 కారు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి రానుంది. మొత్తంగా ఈనెల కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి పైన పేర్కొన్న ఐదు టాప్ కార్లు అందుబాటులో ఉంటాయి.

మెర్సిడెస్-AMG SL 55

Mercedes-AMG SL 55 12 ఏళ్ల తర్వాత భారతదేశంలో తిరిగి అడుగుపెడుతోంది. ఇది జూన్ 22న ఇండియన్ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. 469 bhp, 700 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేయగల అత్యంత శక్తివంతమైన 4.0L ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో ఈ కారు వస్తుంది. ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉంటుంది. ఈ ప్రీమియం పవర్‌ఫుల్ కారు గరిష్ఠంగా గంటకు 295 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement