Thursday, April 25, 2024

క్రిస్మస్ కి థియేటర్లలలో రిలీజ్ కానున్న.. సినిమాలు ఇవే

ఈ క్రిస్మస్ కి పలు సినిమాలు థియేటర్లకి క్యూ కడుతున్నాయి. రిలీజ్ వాయిదా పడ్డ వాటిలో రవితేజ ‘ధమాకా’ సహా పలు టాప్ హీరోల సినిమాలు ఉన్నాయి. నయనతార నటించిన ‘కనెక్ట్’ సినిమా డిసెంబర్ 22న, పృథ్వీ సుకుమారన్ ‘కాప’, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వేద’ డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి. రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధమాకా చిత్రానికి త్రినాధరావు దర్శకత్వం వహించారు.

రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఘన విజయం సాధించిన కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ కొత్త సినిమా 18 పేజెస్. ఇందులో నిఖిల్ సరసన అనుపమ నటించారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ కానుంది. విశాల్ హీరోగా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమా లాఠీ.. ఈ నెల 22న రిలీజ్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సునయన నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్.. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement