Friday, April 26, 2024

Followup: ఇవి మన అతిథులు.. మధ్యప్రదేశ్‌ పార్కులోకి చిరుతలను వదిలిన మోదీ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో-పాల్పూర్‌ నేషనల్‌ పార్‌ ్కలోని వన్యప్రాణుల మధ్యకు ప్రధాని మోడీ శనివారం ఎనిమిది చిరుతలను విడిచిపెట్టారు. వైల్డ్‌లైఫ్‌ ట్రాన్స్‌లొకేషన్‌లో ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి తీసుకొచ్చారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలున్నాయి.1952 నాటికి దేశీయంగా అంతరించిన చిరుతలు 70 ఏళ్ల తర్వాత మళ్లిd భారత గడ్డపైకి తిరిగివచ్చాయి. సన్‌గ్లాస్‌లు, తలపై ఫెడోరా టోపీ ధరించిన మోడీ ఒకటవ, రెండవ ఎన్‌క్లోజర్లలోని చిరుత పులులను విడుదల చేశారు. అవి పార్క్‌లోకి వెళ్తుండగా ప్రొఫెషనల్‌ కెమెరాతో ఫొటోలు తీశారు. అక్కడి సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. ఈ చిరుతలను 24 గంటలపాటు పర్యవేక్షిస్తారు. ఉపగ్రహం ద్వారా వాటిస్థానాలను గుర్తించేందుకు వీలుగా చిరుతలకు రేడియో కాలర్‌లు అమర్చారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ, ఈ సందర్భాన్ని చారిత్రక రోజుగా అభివర్ణించారు. ఈ చిరుతలు మన అతిథులు. కునో-పాల్పుర్‌ నేషనల్‌ పార్క్‌ వాటి ఇల్లు.. స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చాం. నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు. మనదేశం గతంలో ఆసియాటిక్‌ చిరుతలకు నిలయంగా ఉండేదని గుర్తుచేశారు. దశాబ్దాల కిందట జీవవైవిధ్యపు పురాతన బంధం తెగిపోయింది. ఈరోజు తిరిగి ఆ బంధాన్ని అనుసంధానిస్తున్నాం. చిరుతలతోపాటు ప్రకృతిని ప్రేమించే చైతన్యంతో భారత్‌ పూర్తిశక్తితో మేల్కొంది. భారతీయులతోపాటు నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ ప్రాజెక్టుకు రాజకీయ ప్రాధాన్యం ఉన్నట్లు ఎవరూ భావించరని చెప్పారు. అయినప్పటికీ తాము నిరంతరం కృషి చేసి, ఈ చిరుతలను తీసుకొచ్చామన్నారు. విస్తృతమైన చీతా యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేశామన్నారు. నమీబియాలోని నిపుణులతో కలిసి మన దేశ శాస్త్రవేత్తలు పని చేశారన్నారు. మన శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాకు వెళ్ళారని, అక్కడివారు ఇక్కడికి వచ్చారని వివరించారు. మన దేశంలో వీటికి అనువైన స్థలం గురించి అన్వేషించామన్నారు. బాగా పరిశీలించిన తర్వాత కునో నేషనల్‌ పార్క్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. చిరుతల జనాభా ప్రపంచ వ్యాప్తంగా 7000 కంటే తక్కువ ఉంది. 2020 జులైలో ఇండియా – నబీమియా మధ్య చిరుతల సంరక్షణపై అవగాహన ఒప్పందం కుదిరింది. ందులో భాగంగా ఎనిమిది చిరుతలను భారత్‌కు విరాళంగా ఇచ్చేందుకు నమీబియా ప్రభుత్వం అంగీకరించింది.

కాంగ్రెస్‌ విమర్శలు..

- Advertisement -

ఇదిలావుండగా, చిరుతల విషయంలో మోడీ చర్యను కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. భారత్‌ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ అనుసరించిన ఎత్తుగడగా ఎద్దేవాచేసింది. కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ శనివారం మాట్లాడుతూ, పరిపాలనలో కొనసాగింపును నరేంద్ర మోడీ ఎన్నడూ అంగీకరించరని తెలిపారు. తాను 2010 ఏప్రిల్‌ 25న కేప్‌టౌన్‌ వెళ్ళానని, ఈ చీతా ప్రాజెక్టు ఆనాటిదని చెప్పారు. మోడీ చేస్తున్న తమాషా సమర్థనీయం కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement