Thursday, March 28, 2024

ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రకటన

కర్ణాటకలో అసెంబ్లి ఎన్నికల హడావుడి క్రమంగా పుంజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దాదాపుగా ప్రచారంలోకి దూకేశాయి. ఈ క్రమంలో, జనతాదళ్‌ (సెక్యులర్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. 2023 అసెంబ్లి ఎన్నికలే తనకు చిట్టచివరి ఎన్నికలని తెలిపారు. పంచరత్న ప్రచారంలో భాగంగా చెన్నెపట్నలో ఏర్పాటు చేసిన బీహిరంగ సభలో కుమారస్వామి మాట్లాడుతూ, తాను పోటీకి దూరమైనప్పటికీ రాజకీయాల్లో చురుకుగా ఉంటానని చెప్పారు. ”2028 అసెంబ్లి ఎన్నికల్లో నేను పోటీ చేసేది లేదు. రాజకీయాలతో బాగా అలసిపోయాను. విశ్రాంతి అవసరం. అయినప్పటికీ, యాక్టివ్‌ పాలిటిక్స్‌కు ఎప్పటికీ దూరం కాను” అని అన్నారు.

- Advertisement -

పొత్తులుండవు…

2023 అసెంబ్లి ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కుమారస్వామి స్పష్టం చేశారు. 224 అసెంబ్లి స్థానాల్లో 123 స్థానాలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, కర్ణాటక అసెంబ్లి కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఏప్రిల్‌ లేదా మే ప్రథమార్థంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2018 కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లి పరిస్థితి ఏర్పడింది. బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ స్పష్టమైన మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement