Thursday, April 25, 2024

డిసెంబర్‌లో 15 శాతం పెరిగిన థర్మల్‌ విద్యుత్‌

దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి డిసెంబర్‌ నెలలో వార్షిక ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. డిసెంబర్‌లో ఉత్పత్తి 98,443 మిలియన్‌ యూనిట్లకు చేరిందని కేంద్ర గణాంకాలు తెలిపాయి. దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ వాటా 76.59 శాతానికి చేరింది. మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి కూడా క్రితం ఏడాదితో పోలిస్తే గత నెలో 13.65 శాతం పెరిగింది. జలవిద్యుత్‌ ఉత్పత్తి 5.94 శాతం పెరిగి 9,132 మిలియన్‌ యూనిట్లకు చేరింది. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు అధారిత వనరులే కీలకమని ఇటీవల ఎన్టీపీసీ తెలిపింది.

వచ్చే మూడు దశాబ్దాలు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. దేశంలో నాలుగో వంతు విద్యుత్‌ ఉత్పత్తి ఈ సం స్థనే చేపడుతుంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించుకోవాలంటే ఈ మేరకు పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీపీసీ తెలిపింది. ప్రస్తుతానికి పాతవాటి స్థానంలో పర్యావరణ హిత బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement