Friday, March 29, 2024

సీపీఆర్ పై అవగాహన ఉండాలి : వరంగల్ సీపీ రంగనాథ్

గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితుత్తులు శ్యాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణ రక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్ పై ప్రతి పోలీస్ అధికారికి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ‌న్ పోలీసులు సూచించారు. శ్రీశుభం కళ్యాణ వేదికలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. ఆర్వూడ్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ గార్డ్స్, ఆర్మూడ్ రిజర్వ్, సెక్యూరీటీ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో పాటు హోంగార్డ్స్ సిబ్బందికి సీపీఆర్ ఎలా చేయాలనే అంశాలపై ప్రముఖ గుండె వైద్య నిపుణులు రామక శ్రీనివాస్.. వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టు కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోవడంతో దీనిపై స్పందించి సీపీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ అందజేయడం జరుగుతోందన్నారు. కార్డియాక్ అరెస్టు కారణంగా పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ శ్యాసకోశ పునరుజ్జీవనం కలిగించవచ్చన్నారు. ప్రస్తుత రోజుల్లో సీపీఆర్ ప్రక్రియ పై తప్పనిసరిగా అవగాహన కలిగివుంచాలన్నారు.

నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఈ సీపీఆర్ ప్రక్రియ తెలియడం ద్వారా కార్డియా అరెస్టుకు గురైన వ్యక్తిని కాపాడ‌డం ద్వారా వారి కుటుంబాని మేలు చేసివాళ్ళము అవుతామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఒకమారు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా ఈ పరీక్షల ద్వారా ముందుస్తుగానే వ్యాధులను గుర్తించి తగు చికిత్సను తీసుకోవడం సులభం అవుతుందన్నారు. అలాగే కార్డియాక్ అరెస్టు భారీన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత అలవాట్లలో మార్పు రావాలని, ఆహారపు అలవాట్లకు సంబంధించి నియమ నిబంధనలు పాటించాల్సి వుంటుందని, తప్పనిసరిగా శారీరక వ్యాయామం అవసరమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్, క్రైమ్స్ డిసిపిలు కరుణాకర్, మురళీధర్, అదనపు డిసిపిలు పుష్పా సంజీవ్, కుమార్, ఎసిపిలు నాగయ్య, అంతయ్య, సీపీఆర్ శిక్షణా కోర్డినేటర్ డా.లలితాదేవి, యూనిట్ డాక్టర్ విద్యావతి,ఆర్.ఐలు నగేష్, చంద్రశేకర్, భాస్కర్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement