Saturday, April 20, 2024

పునరాలోచనే లేదు.. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే రాతపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరవధిక ఆందోళనలు, నిరసన ప్రదర్శనల గురించి తెలుసా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయం తమకు తెలుసని, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సంబంధిత ఉద్యోగ, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఉద్యోగుల నిరవధిక ఆందోళనల దృష్ట్యా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటారా అన్న మరో ప్రశ్నకు బదులిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement