Wednesday, April 24, 2024

హెచ్చరికలు లేవు‌.. ధమ్కీ మాత్రమే అంటోన్న విశ్వక్ సేన్

హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధమ్కీ’ . ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ ను విష్వక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. మాస్, క్లాస్ కలగలిసిన లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. లాంగ్ స్లీవ్ టి–ష్టర్ ధరించి, చేతికి గోల్డెన్‌ కలర్‌ వాచ్‌, మెడలో చైన్ తో కనుబొమ్మలను ఎగరేస్తూ.. స్టైల్ గా, సీరియస్ గా ఉన్న విష్వక్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఉంది. ‘హెచ్చరికలు లేవు‌.. ధమ్కీ మాత్రమే’ అనే క్యాప్షన్ తో విష్వక్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

అలాగే, సినిమా రిలీజ్ ను సైతం ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని తెలిపాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement