Monday, April 15, 2024

Big Story: నీటిమీద రాత‌లు, పట్నం చ‌దువులు.. స‌ర్కారు స్కూళ్ల‌లో టీచ‌ర్ల కొర‌త‌

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : రాజధాని హైదరాబాద్‌.. ప్రభుత్వ పాఠశాలల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుందనే విమర్శులున్నాయి. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతామని ఆశతో వస్తున్నా నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో తమ సబ్జెక్టులతోపాటు ఇతర సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం గమనార్హం. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తుం డటంతో.. మిగతా సబ్జెక్టులను బోధించేందుకు స్టాఫ్‌ రూమ్‌ల్లో కూర్చొని ఆయా పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లు.. తమకు లేని, తమకు రాని సబ్జెక్టులతో కుస్తీ పడుతున్నారు.

ఎందుకంటే గత 2015అంటే ఏడేళ్ల క్రితం సెకండరీ గ్రేట్‌ టీచర్స్‌ – ఏస్టీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)గా పదోన్నతలు కల్పించినా.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 400నుంచి 480వరకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రతి పాఠశాలలో ఏడు సబ్జెక్టులకు ఏడుగురు ఉపాధ్యాయులు.. ప్రధానోపాధ్యా యుడు, పీఈటీ ఉండాల్సి ఉండగా… ప్రతి సర్కార్‌ బడి లో రెండు లేదా మూడు అంతే కంటే ఎక్కువగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. దీంతో రాబోయే పది పరీక్షల ఫలితాలపై ఈ సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా పడనుంది.

- Advertisement -

కార్యాలయాలకే పరిమితం..!

డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ లేకపోవడంతో చాలా మంది చాత్రోపాధ్యాయులు (బీఈడీ పూర్తి చేసిన వాళ్లు), టెట్‌ అర్హత సాధించి.. ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న వాళ్లు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇలా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు పడకేశాయనే అనిపిస్తోంది. శివారు జిల్లాలు మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డిలో చదువుల సాగులో ముందుకు పోతుండగా.. రాజధాని హైదరాబాద్‌కు అన్నీ సౌకర్యాలుండి కూడా విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతుండటం గమనార్హం. ఇది ఒక సర్కార్‌ బడుల్లో సమస్య కాదు.. అటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సైతం అదే జరుగుతోందనే ఆరోపణలున్నాయి.

సర్కార్‌కు చెందిన కళాశాలలను, లెక్చరర్స్‌ను సర్దుబాటు చేయాల్సిన జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి (డీఐఈవో).. శ్రీచైతన్య, నారాయణ (చైనా) మాఫియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే ప్రచారం నెలకొంది. ఇటీవల ఎస్‌ఆర్‌ నగర్‌లో అనుమతి లేని కళాశాలను వెలుగులోకి తీసుకవచ్చిన విద్యార్థి సంఘం నాయకులపైనే.. ఇటు యాజమాన్యం, అటు డీఐఈవో కేసులు పెట్టించే ప్రయత్నాలు చేయడం గమనార్హం. అయితే విద్యార్థి సంఘం నాయకులు మెట్టు దిగకపోవడంతో చివరికీ అనుమతి లేని కళాశాలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఉన్నాధికారులు సైతం పరీక్షలకు సమయం ముంచుకొస్తున్నా.. సమీక్షలకు దూరంగా ఉండటంతో జిల్లా డీఈవో, అటు డీఐఈవో కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానరాని ‘ఇంటింటా చదువుల పంట’అభ్యసనం..?:

పాఠశాల విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి కార్యక్ర మానికి ఇటీవల విద్యాశాఖ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థుల స్థాయిని ఎప్పటికప్పుడు పెంచడం కోసం ఇంటింటా చదువుల పండుగ కార్యక్రమాన్ని విద్యార్థుల ముంగిటకు తెచ్చిన విషయం విధితమే. ముఖ్యంగా అభ్యసన ప్రక్రియలో నేర్చుకున్నది.. మర్చిపోకుండా పిల్లలకు తరచూ పరీక్ష పెడతారు. వారానికి ఒకసారి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతి సర్కార్‌ పాఠశాలకు చెందిన 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో విద్యార్థులకు తరగతి వారీగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి.. ప్రస్తుతం అమలయ్యే విధానంలో ప్రతీ శనివారం రాష్ట్రం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండల విద్యాశాఖకు అధికారులు లింకులు పంపిస్తుండగా.. దానిని వారు ప్రధాన ఉపాధ్యాయులకు, తరగతి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు పంపించే ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ప్రతీ శనివారం వచ్చిన లింకును ఓపెన్‌ చేసి.. స్టూడెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని విషయాల వారీగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే మూల్యంకనం చేసి ఫలితాలను సైతం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులు ఆయా టాపిక్‌లకు సంబంధించిన వీడియోలు సైతం చూడవచ్చు. అయితే ఇంటింటా చదువుల పంట అభ్యసనం.. గ్రామీణ జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలువుతుండగా… రాజధాని హైదరాబాద్‌లో మాత్రం కనిపించడం లేదని విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు వాపోతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement