Friday, October 11, 2024

Theft – పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..

టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లి లోని ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ జరిగినట్టు స‌మాచారం . ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుండి గణేశ్‌ కనిపించకుండా పోయాడు. దీంతో గణేష్ ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో గణేష్ పాయిపోయినట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

కాగా ఇదివరకు ఫిల్మ్ నగర్ నగర్ లోని ఇంట్లో కూతురు మంచు లక్ష్మితో కలిసి ఉండేవారు మోహన్ బాబు. కొంత కాలంగా జల్‌పల్లి లోని ఇంట్లోకి మారారు. తమకు నమ్మకమైన వ్యక్తిని తమ దగ్గర పని చేసేందుకు పెట్టుకున్నారు మోహన్ బాబు. నమ్మకంగా ఉంటూనే మోహన్ బాబు సొమ్ము నొక్కేసేందుకు స్కెచ్ వేసాడు గణేష్. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో నుండి పది లక్షల రూపాయలు చోరీ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు గణేష్. గణేష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చి చూడగా పది లక్షలు రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు తిరుపతిలో గణేష్ ను అరెస్ట్ చేసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement