Tuesday, April 16, 2024

ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోశాడు

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న డిగ్రీ చదువుతున్న యువతిని మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్‌ వెంబడించాడు. యువతిని అడ్డుకుని నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అంటూ నిలదీశాడు.

తనకు ఇష్టం లేదు, తనని వదిలేయ్‌ అంటూ యువతి ముందుకు వెళ్తుండగా దుండగుడు ఒక్కసారిగా కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యువతి అప్పటికే ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement