Friday, April 19, 2024

అమెరికా వీసాలకు నిరీక్షణ గడువు వెయ్యిరోజులు

అమెరికాకి టూరిస్ట్‌ వీసాల (బి-1,బి-2 వీసాల) కోసం వ్యవధి ముంబాయిలో 999 రోజులు, హైదరాబాద్‌లో 994 రోజులు, ఢిల్లిలో 961 రోజులు పడుతుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసాల జారీలో భారతీయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొంది. వాస్తవం ఇది కాగా, అమెరికన్‌ టూరిస్ట్‌ వీసాలకు వెయ్యి రోజులు పైనే పడుతోంది. బి-1, బీ-2 వీసాలకు వ్యవధిని తొమ్మిది మాసాలకు తగ్గించినట్టు వివరించింది.

గతంలో టూరిస్టు వీసాలపై అమెరికాని సందర్శించినవారు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు పొందుతారని అధికారులు తెలిపారు. వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ కాలాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు వివరించారు. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌వీసాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుతెలిపారు. క్రూవీసాలను వీలైనంత త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement