Monday, December 9, 2024

TG | రైళ్ల రాకపోకలు షురూ..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 24 గంటల పాటు నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) అప్ లైన్లో గూడ్స్ రైలు ద్వారా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రైళ్ల రాకపోకలకు అనుమతించారు. ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు కాసేపట్లో పరుగులు తీయనున్నాయి. మరో రెండు గంటలు డౌన్ లైన్ లో ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం రాకపోకలకు అనుమతించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

మంగళవారం రాత్రి ఘజియాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి 12 బోగీలు ట్రాక్పై పడడంతో 24 గంటలుగా ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోయిన విషయం విధితమే. 24 గంటల నుండి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. రేపు మధ్యాహ్నం కల్లా సెంటర్ లైన్ మరమ్మతులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement