Sunday, May 28, 2023

రేపే యశోద ట్రైలర్.. రిలీజ్ చేయనున్న నటుడు సూర్య

విడాకుల అనంతరం పలు చిత్రాలతో దూసకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత.ఈమె ప్రధానపాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం యశోద.బ ఈ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీ దేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యశోద సినిమా ట్రైలర్ ని అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు… ఈ సినిమా ట్రైలర్‌ ను స్టార్‌ హీరో సూర్య చేతుల మీదుగా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement