Thursday, March 28, 2024

‘ద వారియర్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది.. పోలీస్ ఆఫీసర్ గా దుమ్మురేపిన రామ్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ది వారియర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ఈ ట్రైలర్‌లో రామ్ మరో లుక్‌లోనూ మనకు కనిపిస్తున్నాడు. అటు గురు పాత్రలో నటుడు ఆది పినిశెట్టి హైలైట్‌గా ఉన్నాడు. అతడి స్లాంగ్, అతడి లుక్స్ గురు పాత్రను ఈ సినిమాకే హైలైట్‌గా చేయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి లింగుస్వామి ఓ పవర్‌ఫుల్ కథతో రామ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శ్రీనివాస చెట్టూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement