Friday, April 19, 2024

బెంగ‌ళూరును సిటీని ముంచెత్తిన కుండపోత వర్షం.. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారుకు శానా క‌ష్టాలు

కుండపోత వర్షం భారతదేశంలోని సిలికాన్‌వ్యాలీ అయిన బెంగళూరుని సరస్సుగా మార్చివేసింది. భారీ వర్షం అలా కురుస్తూనే ఉంది. వరదలాంటి పరిస్థితుల మధ్య చాలా ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. పలు నివాస ప్రాంతాలు నీట మునిగి ఉండడంతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బెల్లందూర్‌, సర్జాపురా రోడ్‌, వైట్‌ఫీల్డ్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, బిఇఎంఎల్‌ లే అవుట్‌ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు అక్కడ ప్రజలను ఖాళీ చేయించేందుకు తెప్పలను పంపారు. ట్విటర్‌లో, నెటిజన్లు జలమయమైన రోడ్ల చిత్రాలను, వీడియోలను పంచుకుంటున్నారు. బెల్లందూర్‌ సమీపంలోని ఎకోస్పేస్‌ వద్ద పరిస్థితి భయానకరంగా ఉంది. వాహనాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదని ఆందోళనచెందుతున్నారు.

గంటల తరబడి వర్షం అనేక ప్రాంతాలను ముంచెత్తిన ఫొటోలను స్థానికులు నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. వీటిలో మారతహల్లిలోని స్పైస్‌గార్డెన్‌ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్పైస్‌ గార్డెన్‌ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రహదారిని బ్లాక్‌ చేశారు. బెల్లందూర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డలో నీరు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. వరద నీరు ఇళ్లలోకి చొరబడటంలో కొన్ని ఇళ్లల్లో ఏకంగా రిఫ్రిజిరేటర్లు నీటిలో తేలుతున్నాయి. వాతావరణశాఖ నివేదిక ప్రకారం బెంగళూరులో సోమవారం 12.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు బెంగళూరులో 1,091 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement