Thursday, April 25, 2024

వివేకానంద కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం సీరియస్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది. వివేకానంద హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను విచారణ జాప్యం చేస్తున్నందున మార్చాలని హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని, దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. త్వరగా విచారణ ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సీబీఐని అడిగింది.

దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్‌కు న్యాయమూర్తుల బెంచ్ ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. దర్యాప్తు తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలనిఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. గతంలో రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement