Saturday, April 20, 2024

తెలంగాణాలో బాగా తగ్గిన అన్నదాతల ఆత్మహత్యలు.. కేంద్రప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, తెలంగాణాలో బాగా తగ్గాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రైతుల ఆత్మహత్యలపై రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలుగు రాష్ట్రాల వివరాలు వెల్లడించారు. తెలంగాణా సహా అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుతుండగా ఏపీతో పాటు అతి కొద్ది రాష్ట్రాల్లో అన్నదాతల బలవన్మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ళుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా తెలంగాణాలో బాగా తగ్గుదల కనిపిస్తోందని ఆయన వివరించారు.

2017లో 375 మంది, 2018లో 365 మంది ఆత్మహత్యలకు పాల్పడగా… 2019వ సంవత్సరంలో 628 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని జవాబులో పేర్కొన్నారు. తెలంగాణాలో 2017లో 846 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా 2018లో 900 మంది, 2019లో 491, 2020లో 466 మంది, 2021లో 352 రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయని కేంద్రమంత్రి చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement