Saturday, March 23, 2024

కోహ్లీ, పాండ్యా అద‌ర‌గొట్టే స్టెప్పులు… నెట్టింట్లో సంద‌డి చేస్తోన్న వీడియో..

భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు మంచి ఆట‌గాళ్లే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా.. ఆట‌లోకి దిగిందంటే కలిసికట్టుగా ఆడుతూ జట్టును గెలిపించే వీళ్లు బయట మాత్రం చాలా సరదాగా ఉంటారు. విష‌య‌మేంటంటే వీరిద్ద‌రు క‌లిసి ఒక పాట‌కు స్టెప్పులేశారు. ఇదికాస్త నెట్టింట‌ వైర‌ల్ గా మారింది. టిక్ టాక్ లో వైరల్ అవుతున్న ‘షకబూమ్’ పాటకు ఈ ఇద్దరూ కలిసి కాళ్లు కదిపారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో వైరల్ అయ్యింది. కోహ్లీ, పాండ్యా ఫన్నీ స్టెప్పులు నవ్వులు పూయిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement