Thursday, April 25, 2024

ఆశలు రేపిన రెండో టీ 20.. రేపు లక్నో వేదికగా కివీస్‌తో ఇండియా పోరు

కివీస్‌తో మూడు వన్డేలు ఆడిన ఇండియా క్లీన్‌ స్వీప్‌తో వైట్‌ వాష్‌ చేసిన టీమిండియా శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టీ 20 చేజార్చుకుంది. అయితే ఈ చేదు అనుభవం పునరావృతం కాకుండా రెండో టీ 20ను కైవసం చేసుకోవడానికి హార్థిక్‌ పాండ్యా సేన లక్నో వేదికగా మరో మ్యాచ్‌ ఆడటానికి సిద్దంగా ఉంది. భారత జట్టు శనివారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మునిగితేలింది. తొలి టీ 20లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌లో 47 పరుగులు సంధించాడు. రేపు (ఆదివారం) జరగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ వేసిన సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంది.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్లు రాంచీలో స్పిన్‌ ప్రెండ్లీ ట్రాక్‌ను సర్దుబాటు చేసుకోలేక విఫలమయ్యారు. దీంతో 21 పరుగుల తేడాతో కివీస్‌కు విజయాన్ని అందించింది భారత్‌. స్పీడ్‌ స్టర్లు హార్థిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు తమ లోపాలను విస్మరించారు. తన కెరీర్‌ను ప్రధానంగా టాపార్డర్‌ బ్యాటర్‌గా ప్రారంభించినప్పటి నుండి వాషింగ్టన్‌ సుందర్‌ ఫ్రంట్‌ లైన్‌ స్పిన్నర్‌గా పరిణామం చెందాడు. అతను లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ ఫినిషర్‌గా కూడా పని చేయగలడు.

- Advertisement -

టీ 20ల్లో భారత బ్యాటింగ్‌ ఎక్కువగా సూర్యకుమార్‌ యాదవ్‌ పైనే ఆధారపడి ఉంది. 47 పరుగుల తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ ఔట్‌ కావడంతో ఓటమి ఖరారైందని క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠీ, అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌లతో ఔటయ్యారు.

జట్ల వివరాలు..

ఇండియా: హార్థిక్‌ పాండ్యా (కెప్టెన్‌),సూర్యకుమార్‌ యాదవ్‌ ( వైస్‌ కెప్టెన్‌) ఇషాన్‌ కిషన్‌ , శుభమన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠీ, జితేష్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దిdప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి, పృథ్వీ షా, ముఖేష్‌ కుమార్‌

న్యూజిలాండ్‌: మిచేల్‌ సాంటర్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌ , మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్మన్‌ , డేన్‌ క్లేవర్‌, డేవన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, లాకీ పెర్గుసన్‌, బెన్‌ లిస్టర్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచేల్‌ రిపోన్‌,హెన్రీ షిప్లే, ఇష్‌ సోధీ, బ్లేయర్‌ టిక్నర్‌

సమయం : రాత్రి ఏడుగంటల నుంచి

Advertisement

తాజా వార్తలు

Advertisement