Friday, March 29, 2024

జులైలో తగ్గిన ఈ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు.. భారీగా పెరిగిన కార్ల అమ్మకాలు

ఎలక్ట్రికల్‌ టూ వీలర్ల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జులై తగ్గాయి. జూన్‌తో పోల్చితే జులైలో వీటి రిజిస్ట్రేషన్లు 5శాతం తగ్గి, 32,450కి చేరాయని వాహన్‌ పోర్టల్‌ వెల్లడించిన గణాంకాలు తెలుపుతు న్నాయి. ఈవీ టూ వీలర్స్‌ అమ్మకాల్లో టాప్‌లో ఉన్న 8 కంపెనీల వివరాలను ఈ పోర్టల్‌ వెల్లడిం చింది. ఓలా, ఏథర్‌ ఎనర్జీ, యాంపియర్‌ రివోల్ట్‌, ప్యూర్‌ ఈవీ వంటి ప్రముఖ కంపెనీల వాహనాల అమ్మకాలు తగ్గాయి. పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలతో పోల్చితే, ఈవీ అమ్మకాలు తక్కవగానే తగ్గాయి. అనేక సాంకేతిక కారణాలతో ఈవీ టూవీలర్స్‌లో ప్రమాదాలు జరగడంతో వీటి అమ్మకాలపై ప్రభా వం పడిందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరిలో మార్కెట్‌లో ఉన్న మొత్తం టూ వీలర్స్‌ లో విద్యుత్‌ టూ వీలర్లు 2.6 శాతం ఉన్నాయి.

ఏప్రిల్‌ నాటికి ఈ సంఖ్య 3.63 శాతానికి పెరిగింది. ఏప్రి ల్‌లో ఓలా ఎలక్ట్రికల్‌ రికార్డు స్థాయిలో 12,702 వాహనాలను విక్రయించింది. మొత్తం 43,098 విద్యుత్‌ వాహనాల అమ్మకాలు జరిగాయి. మే నెల లో వీటి అమ్మకాలు 2.81 శాతం తగ్గాయి. జూన్‌లో తిరిగి 3.3 శాతానికి అమ్మకాలు చేరాయి. 2022లో అన్ని కంపెనీలు కలిసి 7.50 లక్షల ఈవీ టూ వీలర్స్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టకున్నాయి. ఈ ఏడు నెలల్లో కేవలం 2.60 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించకలిగారు. లక్ష్యాన్ని చేరుకోవా లంటే ప్రతినెల లక్ష వాహనాలు విక్రయించాల్సి ఉంటుంది.

పెరిగిన కార్ల అమ్మకాలు
సెమీకండక్టర్‌ల లభ్యత పెరగడంతో కస్టమర్లకు కంపెనీలు బుక్‌ చేసుకున్న కార్లను డెలివరీలను పెంచాయి. మారుతి సుజుకీ, హండ్యాయ్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు జులై నెలలో రెట్టింపు అమ్మకాలను నమోదు చేశాయి. వీటితో పాటు కియా ఇండియా, టయోటా, హోండా కార్స్‌, స్కోడా కంపెనీల ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
మారుతి సుజుకీ కంపెనీ కార్ల అమ్మకాలు 6.82 శాతం పెరిగాయి. గత సంవత్సరం జులై 1,22,732 యూనిట్ల అమ్మకాలు జరిగితే , ఈ సంవత్సరం జులైలో 1,42,850 యూనిట్ల అమ్మకాలు జరిగా యి. మారుతిలో ఎక్కువ అమ్మకాలు బాలి నో, సెలారియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, టూర్‌ఎస్‌ , వ్యాగ నార్‌ ఆర్‌ అమ్మకాలు ఎక్కవగా జరిగాయి.

బ్రిజా, ఎర్టిగా, ఎస్‌ క్రాస్‌, ఎక్స్‌ఎల్‌ 6, ఆల్టో అమ్మకా లు కూడా గణనీయంగా పెరిగాయి. అన్ని కంపెనీల కార్లు మొత్తం 3.42 లక్షల యూనిట్ల అమ్మకాలు జరి గాయి. ఇదే కాలంలో గత సంవత్సరం 2.94 లక్షల వాహనాలు విక్రయించారు. ఈ సంవత్సరం మొత్తం 37 లక్ష ల యూనిట్లు అమ్మకాలు జరుగు తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హుండాయ్‌ కంపెనీ మొత్తం 50,500 యూనిట్లను విక్రయించింది. 2021, జులైలో 48,042 వాహనా లను విక్రయించింది. టాటా కంపెనీ కార్ల అమ్మకా లు 57 శాతం పెరిగాయి. జులైలో కంపెనీ మొత్తం 47,505 యూనిట్లును విక్రయించింది. 2021 జులై కంపెనీ 30,185 కార్లను అమ్మింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ కార్ల అమ్మకాలు 33 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం జులైలో కంపెనీ 28,053 వాహనాలను విక్రయించింది. గత సంవ త్సరం ఇదే కాలంలో 21,046 వాహనాలను అమ్మిం ది. ఈ కంపెనీ యూటిలిటీ (కమర్షియల్‌) వాహనాల అమ్మకాలు 34 శాతం పెరిగాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement