Tuesday, April 23, 2024

75 నిమిషాల్లో బెంగళూరు – మైసూరు.. కొత్త ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12న కర్ణాటకలో పర్యటించనున్నారు, అక్కడ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 118 కి.మీ పొడవైన ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు – మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 3 గంటల నుండి 75 నిమిషాలకు తగ్గించ‌నుంది.

మాండ్యలో ప్రధానమంత్రి పర్యటన గురించి తెలియజేస్తూ.. “దేశమంతటా ప్రపంచ స్థాయి కనెక్టివిటీని నిర్ధారించాలనే ప్రధాన మంత్రి దృక్పథానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా జ‌రుగుతుంది. ఈ ప్ర‌య‌త్నంలో ముందుకు సాగుతూ, ప్ర‌ధాన మంత్రి బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని జాతికి అంకితం చేయ‌నున్నారు. అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12న కర్ణాటకలో పర్యటించనున్నారు, అక్కడ సుమారు రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన తెలిపింది.

ఈ ప్రాజెక్ట్‌లో NH-275లోని బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్‌లో 6-లేనింగ్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో బాగా స‌హాయ ప‌డనుంది. అంతే కాకుండా.., ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శ్రీరంగపట్నం, కూర్గ్, ఊటీ & కేరళ వంటి ప్రాంతాలకు ఈజీగా చేరుకోడానికి స‌హాయ‌ప‌డుతుంది, తద్వారా పర్యాటక సామర్థ్యాం పెరిగే అవ‌కాశం ఉంది.

- Advertisement -

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేసిన త‌రువాత‌.. మైసూరు-ఖుషాల్‌నగర్ 4 లేన్ హైవేకి ప్రధాని శంకుస్థాపన చేయ‌నున్నారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ.4130 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయబడుతుంది. బెంగుళూరుతో కుశాల్‌నగర్ కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు ప్రయాణ సమయాన్ని 5 నుండి 2.5 గంటల వరకు సగానికి తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement