సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న యువ నటి చెన్నైలో ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఏపీలోని తిరుపతి జిల్లా సత్యవేడులోని ఇంద్రానగర్ ఈమె స్వగ్రామంగా తెలుస్తోంది. తమిళనాడులో రిపోర్టర్‌గా, యాంకర్‌గా, వర్తమాన హీరోయిన్‌గా దీప అలియాస్ ఫౌలిన్ గుర్తింపు తెచ్చుకుంది. దీప ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
- Advertisement -