Friday, April 19, 2024

Delhi: ఓలా, ఉబర్ యాజమాన్యాలు కమిషన్ రేట్ తగ్గించాలి.. కేంద్ర మంత్రి గడ్కరీకి బీసీ సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్ వంటి ఆన్‌లైన్ ట్యాక్సీ సంస్థలు వసూలు చేస్తున్న అత్యధిక కమిషన్ల గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీసుకొచ్చింది. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధన్ నేతృత్వంలో ప్రతినిధులు తొలుత కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను కలిశారు.

క్యాబ్ డ్రైవర్ల నుంచి ఓలా, ఉబర్ సంస్థలు క్యాబ్ డ్రైవర్లు (యజమానులు) నుంచి ఏకంగా 25% నుంచి 30% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారని, తద్వారా ప్రయాణికులపై అధికభారం పడుతోందని, క్యాబ్ డ్రైవర్లకు సైతం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. కమిషన్ 10 శాతం మించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముద్ర రుణాలు, తరుణ్ వంటి పథకాలను క్యాబ్ డ్రైవర్లకు వర్తింపజేస్తూ వారు కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునేలా ప్రోత్సహించాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు కేంద్ర మంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తులను రాందాస్ అథవాలే ఓ లేఖలో పొందుపరుస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement