Friday, April 19, 2024

వచ్చే 3 నెలలు మండుటెండలే.. మహారాష్ట్రతో పాటుగా 8 రాష్ట్రాల్లో వడగాడ్పులు: ఐఎండీ

ఈ సంవత్సరం దేశంలోని అనేక ప్రాంతాలు మండుటెండలను చవిచూస్తాయని, ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల మధ్య కాలంలో అత్యంత సంఖ్యలో వడగాడ్పులను ఎదుర్కొనే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైెరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర శనివారం అన్నారు. ఐఎండీ సూచన మేరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

మధ్య, తూర్పు, వాయవ్య ప్రాంతాల్లోని మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా లాంటి రాష్ట్రాలు అత్యధిక సంఖ్యలో తీవ్రమైన వడగాడ్పులను చవిచూడనున్నాయి. అయినప్పటికీ ఏప్రిల్‌ మాసంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement