Saturday, April 20, 2024

మోహన్‌లాల్ సినిమా కోసం సౌత్ ఆఫ్రికా నుంచి వ‌చ్చిన‌ మ్యూజిక్ కంపోజ‌ర్…

మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ లేటెస్ట్ మూవీ “బరోజ్: గార్డియన్ ఆఫ్ డి’గామాస్ ట్రెజర్”. మోహన్‌లాల్ మ‌ల‌యాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళం భాష ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచితుడే. ఎన్నో సినిమాల‌కు నిర్మాత‌గా, మూవీ డిస్టూబ్యూట‌ర్ గా, సింగ‌ర్ గా వ‌ర్క్ చేశాడు. అయితే, ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న ఈ ఫాంట‌సీ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు మోహన్‌లాల్. కాగా, ఈ సినిమా ఇదే పేరుతో ఉన్న‌ ఒక నవల ఆధారంగా రూపొందుతుంది.

ఈ ఫాంట‌సీ సినిమా కోసం దక్షిణాఫ్రికా మ్యూజిక్ కంపోస‌ర్ మార్క్ కిలియన్ మూవీ యూనిట్ లో యాడ్ అయ్యారు. ఇదే విషయాన్ని మోహన్‌లాల్ తన సోషల్ ప్రొఫైల్‌లో వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి యూనిట్‌కి మార్క్ కిలియన్ సహాయం చేయనున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని 3ఢీ లో కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అంతే కాకుండ, ఈ బిగ్ బ‌డ్జెట్ మూవీ చైనీస్, పోర్చుగీస్ తో పాటు ఏకంగా 20 భాష‌ల్లో రిలీజ్ కానుంది.

ఇక‌ ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని ప్రీంబావూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో మాయ, శర వేగ, తుహిన్ మీనన్, గురు సోమసుందరం, సీజర్ లోరెంటే రాటన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement