Thursday, April 18, 2024

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

ఈ ఏడాది(2022)ని విజయపథంలో ముగించాలని టాలీవుడ్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రవితేజ, నిఖిల్ సిద్దార్థ్ సినిమాలు కొన్ని ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు సిద్దంగా ఉన్నాయి.. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

- Advertisement -

థియేటర్స్ :

18 పేజెస్ – డిసెంబర్ 23

“కార్తికేయ 2” సక్సెస్ తరువాత నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా “18 పేజెస్”. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

ధమాకా – డిసెంబర్ 23

రవితేజ ‘ధమాకా’ ఈ వారం విడుదలవుతున్న అతిపెద్ద తెలుగు చిత్రం. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సర్కస్ – డిసెంబర్ 23

రోహిత్ శెట్టి, రణ్‌వీర్ సింగ్‌ల “సర్కస్” ఈ సంవత్సరంలో అత్యంత ఎదురుచూసిన సినిమాలలో ఒకటి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ మూవీలో జాక్వీలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.

ఓటీటీ :

Glass Onion: A Knives Out Mystery – నెట్‌ఫ్లిక్స్/ డిసెంబర్ 23
The Fabulous – వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్/ డిసెంబర్ 23
Tara Vs Bilal – నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 23
The Teacher – నెట్‌ఫ్లిక్స్/ డిసెంబర్ 23
The Witcher: Blood Origin – వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్/ డిసెంబర్ 25

Itlu Maredumilli Prajaneekam – జీ5/ డిసెంబర్ 23
Kathmandu Connection S2 – వెబ్ సిరీస్ – జీ 5/ డిసెంబర్ 23
Kaari – జీ 5/ డిసెంబర్ 23

Strange World – హాట్‌స్టార్/ డిసెంబర్ 23
Kathmandu Connection – వెబ్ సిరీస్ – సోనీ లైవ్/ డిసెంబర్ 23
Khadaipoma – ఆహా/ డిసెంబర్ 23
Top Gun : Maverick – ప్రైమ్ వీడియో/ డిసెంబర్ 26

Advertisement

తాజా వార్తలు

Advertisement